జిల్లా ముఖచిత్రం
జనరల్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ నందమూరి తారక రామారావు గారి అపూర్వమైన కృషికి గౌరవం మరియు గుర్తింపుగా కొత్తగా ప్రతిపాదించబడిన జిల్లాకు ఎన్ . టి . ఆర్ . జిల్లా అని పేరు పెట్టారు. ఎన్ . ఆర్ . టి . జిల్లా విజయవాడలో జిల్లా ప్రధాన కార్యాలయంతో గతంలో బెజవాడగా పిలువబడేది.
జిల్లా 20 మండలాలుగా చేస్తూ ,మూడు రెవెన్యూ డివిజన్ లు 1.విజయవాడ 2. నందిగామ 3. తిరువూరుగా విభజించబడింది. జిల్లా సహజంగా అప్‌ల్యాండ్ జోన్. ఎత్తుప్రాంతంలో నీటిపారుదలకి ప్రధాన వనరులు ట్యాంకులు. ఇది నాగార్జున సాగర్ నీటి ద్వారా కూడా ప్రయోజనం పొందుతోంది, డెల్టా భూమి కృష్ణా నది కాలువల ద్వారా సాగునీటిని పొందుతోంది.
జిల్లాలో జనాభా 22 ,18 ,591, ఇందులో 305 నివాసగ్రామాలు మరియు 16 జనావాసాలు లేని గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 4 మునిసిపాలిటీలు 1. తిరువూరు 2. నందిగామ 3. జగ్గయ్యపేట 4. ఇబ్రహీంపట్నంగా మరియు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి.
భౌతిక లక్షణాలు
లాటిట్యూడ్
16° 86’ N and 17° 14’ N
లాంగిట్యూడ్
15° 71’ E and 16° 47’ of E
వైశాల్యము
3,316 చ.కిమీ.
సరిహద్దులు
తూర్పు
ఏలూరు జిల్లా
పశ్చిమం
గుంటూరు మరియు నల్గొండ జిల్లాలు
ఉత్తరం
ఖమ్మం జిల్లా
దక్షిణము
కృష్ణాజిల్లా
నదులు:
ఈ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కృష్ణానది ప్రవహిస్తోంది. మెట్టప్రాంత మండలాలతో పాటు డెల్టా మండలాల్లో కొంత భాగం ఇప్పుడు సాగునీటి అవసరాల కోసం కృష్ణా నది నీటిని వినియోగించుకునే సౌకర్యం కలిగి ఉన్నది . కృష్ణా, గోదావరి మరియు కావేరి వంటి దక్షిణ భారతదేశంలోని గొప్ప మరియు పవిత్రమైన నది అయిఉండి , ద్వీపకల్పం మీదుగా పశ్చిమం నుండి తూర్పు వరకు ప్రవహిస్తుంది మరియు చివరకు రెండు ప్రధాన ముఖద్వారాల ద్వారా సముద్రంలో కలుస్తుంది. ఇతర వాగులు మరియు ఉపనదులలో మునియేరు, బుడమేరు మరియు తమ్మిలేరు ముఖ్యమైనవి.
మునియేరు వాగు కృష్ణానదికి ప్రధాన ఉపనది మరియు ఇది ఉత్తరం నుండి దక్షిణానికి పూర్వపు జగ్గయ్యపేట మరియు నందిగామ తాలూకాల మీదుగా ప్రవహిస్తుంది. జిల్లాలో ఇది అదనపు నీటిపారుదల వనరు. బుడమేరు మరొక కొండ వాగులు మైలవరం, జి.కొండూరు, ఉంగుటూరు, విజయవాడ వంటి అనేక మండలాల గుండా ప్రవహిస్తూ చివరకు కొల్లేరు సరస్సులో కలుస్తుంది . వ్యవసాయపరంగా, పైన పేర్కొన్న మూలాల యొక్క ప్రాముఖ్యత మరింత ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అవి మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను మాత్రమే కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ వనరులు మరియు భూగర్భ జలాల సామర్థ్యాన్ని కూడా అందిస్తాయి.
వాతావరణం & వర్షపాతం:
ఈ జిల్లాలో వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయి మరియు శీతాకాలంతో చల్లని ఉష్ణమండల వాతావరణ కూడిన పరిస్థితులు నెలకొంటాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు అత్యంత వేడిగా ఉండే నెలలు , మేలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. రుతుపవనాలు సాధారణంగా జూన్ మధ్యలో నుండి అక్టోబర్ మధ్య వరకు మంచి వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లా సాధారణ వర్షపాతం 1035.1 మిల్లీమీటర్లు , ఇందులో 2/3% వంతు నైరుతి రుతుపవనాల ద్వారా పొందబడుతాయి . 2019-20లో సగటు వర్షపాతం 761.00 మిల్లీమీటర్లు.
నేలలు:
ఈ జిల్లాలో ముఖ్యంగా మూడు రకాల నేలలు ఉంటాయి అంటే, 57.6% శాతం ఉన్న నల్ల నేలలు , 22.3% శాతం ఇసుక బంకమట్టి మరియు 19.4% శాతం ఎర్రమట్టి నేలలు ప్రబలంగా ఉన్నాయి, సముద్ర తీరంలో 0.7% అంచులు చిన్న ఇసుక నేలలుగా ఉంటాయి .
వ్యవసాయం:
జిల్లా అనేక రకాలైన నేలలతో కూడి వ్యవసాయంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. వ్యవసాయం చాలా ముఖ్యమైన వృత్తి మరియు వరి ఉత్పత్తి చేసే ప్రధాన ఆహార పంట. జిల్లా 2019-20 స్థూల పంట విస్తీర్ణంలో 2.15 లక్షల హెక్టార్లు కాగా, స్థూల సాగునీటి ప్రాంతంలో 1.08 లక్షల హెక్టార్లు.
రవాణా & కమ్యూనికేషన్స్:
జిల్లాలో రోడ్లు మరియు రైల్వేల ద్వారా బాగా సేవలు అందిస్తోంది. 321 గ్రామాలు (కొన్ని ప్రధాన గ్రామాలతో సహా) రవాణా సౌకర్యాలతో అనుసంధానించబడ్డాయి . వీటిలో 321 గ్రామాలు ఆర్ . టీ . సీ . ద్వారా అనుసంధానించబడ్డాయి. ఈ జిల్లాకు విజయవాడ నగరం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంటు ఢిల్లీ, కలకత్తా, మద్రాస్, హుబ్లీ, గుడివాడ మరియు మచిలీపట్నంలకు అనుసంధానించబడిన ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్ గా ఉంది. దీనికి 16 కిలోమీటర్ల దూరంలో గన్నవరంలో ఏరోడ్రోమ్ ఉంది.
అక్షరాస్యత:
ఎన్ . టి . ఆర్ . జిల్లా 2011 జనాభా లెక్కల ప్రకారం 74.43 అక్షరాస్యతను నమోదు చేసింది . ఈ జిల్లా విద్యారంగంలో చాలా ముందుంది. జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఎన్ . టి . ఆర్ . వైద్య విశ్వవిద్యాలయం విజయవాడలోనే ఉన్నది .
ఖనిజ వనరులు:
అనేక ఖనిజాలు…
1. క్రోమేట్
కొండపల్లి కొండలు మరియు పరిసర ప్రాంతాలు.
2 . వజ్రం
పరిటాల, ఉస్తేపల్లి, కొడవటికల్లు, రామన్నపేట , ఉర్యవరం, కొత్తపేట, నెమలిపురం, మొగలూరు, పుట్రేల తదితర ప్రాంతాలు.
3. ఇనుప ఖనిజం
జగ్గయ్యపేట ప్రాంతం.
4. లైమ్ స్టోన్
జగ్గయ్యపేట ప్రాంతం.
5. మైకా
తిరువూరు ప్రాంతం.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు క్రోమేట్ కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా, గ్రేడ్ మరియు నిల్వలను అంచనా వేయడానికి వివరణాత్మక అన్వేషణను నిర్వహించడం విలువైనది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిక్షేపాల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి పరిటాల మరియు ఇతర ప్రాంతాలలోని డైమండ్ ఫెర్రస్ కంకరల వివరణాత్మక అన్వేషణను చేపట్టారు .
జగ్గయ్యపేట ప్రాంతంలోని ఇనుప ఖనిజాన్ని చాలా వరకు తవ్వి ఎగుమతి చేయడంతో మైనింగ్ పరిశ్రమ మూతపడింది.