ముగించు

ఇంజనీరింగ్ పర్యాటక రంగం

1.ప్రకాశం బ్యారెజ్

Barriage విజయవాడ వద్ద, కృష్ణా నది పై నిర్మించిన బ్యారేజి. దీని పొడవు 4,014 అడుగులు. దీని నిర్మాణ బాధ్యతలు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో సర్ ఆర్థన్ కాటన్ చేపట్టాడు. దీని నిర్మాణము 1852 లో ప్రారంభమై 1855 లో పూర్తయింది. కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీటిని అందించే నీటిపారుదల ప్రాజెక్టు ఈ ప్రకాశం బారేజి. ఇప్పటి బారేజి 1952లో నిర్మించబడినా, అంతకు 100 సంవత్సరాల కిందటే -1853లో – కృష్ణా నది జలాలను వినియోగించుకోవడాన్ని ఉద్దేశించిన మొట్టమొదటి నిర్మాణం జరిగింది. అదే కాటన్ ఆనకట్ట. తెలుగుదేశంలో సర్ ఆర్థన్ కాటన్ నిర్మించిన రెండు ప్రముఖ ఆనకట్టలలో ఇది రెండోది. మొదటిది, గోదావరి నదిపై గల కాటన్ బారేజి. అన్ని అంశాలను వివరంగా పరిశీలించిన తరువాత, ప్రస్తుత బ్యారేజీని 1954-1957 మధ్య కాలంలో రూ. 2.278 కోట్ల వ్యయంతో నిర్మిచారు. గొప్ప నాయకుడు మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశం పంతులు పేరు మీద ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టారు.